
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రంగూడలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుధవారం కార్పొరేటర్ కోమిరిశెట్టి సాయిబాబా పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ నేడు తెలంగాణ విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చారని సాయిబాబా తెలిపారు. పిల్లల ఉజ్వల భవిష్యత్ కు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింహులు, రేవతి, రత్న కుమారి, జగన్మోహన్, రాకేష్, రవి, సునీత, నాయకులు ధనరాజ్ సింగ్, చోటంసింగ్, యాదయ్య పాల్గొన్నారు.