
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. మంగళవారం ఒక్కరోజే మహమ్మారి కారణంగా 4గురు మృతిచెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరింది. దీంతో పాటు మొత్తం కేసులు 1634కి చేరుకున్నాయి. మంగళవారం రాష్ట్రంలో మరో 42పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 585ఆక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే నమోదు అవుతుండడం కలవరపెడుతోంది. మంగళవారం నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 34 కేసులు నమోదు కాగా మిగిలినవి వలస కూలీల కేసులు. మంగళవారం మరో 9మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1011 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.