
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజులుగా తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా మహమ్మారి గురువారం మరోసారి పంజా విసిరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీనితో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 28కు చేరింది. గురువారం మరో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1038కు చేరింది. గురువారం మరో 33 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 568 అక్టీవ్ కేసులు ఉన్నాయి. గురువారం చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు.