
హైదరాబాద్,నిఘా24: కోవిడ్ నిర్దారణ పరీక్షల కోసం నిర్వహిస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలతో గందరగోళం నెలకొంటుంది. ర్యాపిడ్ యాంటిజెన్ తో కరోనా నిర్దారణ కేవలం 70శాతం మాత్రమే ఖచ్చితత్వం ఉండడంతో భాదితులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో 90శాతం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలే నిర్వహిస్తుండగా, వీటి ఫలితాలపై అయోమయం నెలకొంది. సత్వర ఫలితాల కోసం ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షలపై అపోహలు నెలకొన్నాయి. ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా నిర్ధారణ పరీక్షలలో నెగెటివ్ వచ్చినా, బాధితుడికి కరోనా లేదని ధ్రువీకరించలేని పరిస్థితులుండటంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా లక్షణాలు ఉండీ, యాంటిజెన్ పరీక్షల్లో నెగిటివ్ రావడం, అనంతరం నిర్వహించిన అర్ టీ – పిసీఆర్ లో పాజిటివ్ వచ్చిన ఘటన లు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే పూర్తిస్థాయి పాజిటివ్‌గానే నిర్ధారణ చేస్తారు. అయితే నెగెటివ్ వస్తే దాని కచ్చితత్వం 70 శాతంలోపేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. నెగెటివ్ వచ్చిన వారందరికీ తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయాల్సిందేనని నెల క్రితం ప్రకటించిన ఐసీఎంఆర్, కొన్ని రోజుల క్రితం దానికి కీలక సవరణ చేసింది. ‘యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేయాలని, వారికి ఎలాంటి లక్షణాలు లేకుంటేనే దాన్ని నెగెటివ్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇంత స్పష్టంగా మార్గదర్శకాలున్నా యాంటిజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చి, లక్షణాలున్న వారిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంది. దీంతో వారు దర్జాగా బయట తిరుగుతున్నారు. వారి ద్వారా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో వచ్చే నెగెటివ్ ఫలితాలపై నీలినీడలు అలుముకున్నాయి.
రాష్ట్రంలో కరోనా నిర్ధారణ కోసం విరివిగా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. మొబైల్ ల్యాబ్‌ల ద్వారా కూడా చేస్తున్నారు. ఇది మంచిదే అయినప్పటికీ.. నెగిటివ్ వచ్చి లక్షణాలున్న వారికి ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేయాలన్న నిబంధనను కింది స్థాయిలో పట్టించుకోవడం లేదు. పైగా దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చి లక్షణాలున్నా ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకోవడంలేదు. దీంతో చాలామంది లక్షణాలున్నవారు వైరస్‌ను ఇతరులకు వ్యాపింపజేస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పీసీఆర్ పరీక్షల ఫలితాలకు మూడు, నాలుగు రోజుల సమయం పడుతుండడం, యాంటిజెన్ పరీక్ష ఫలితాలు అరగంటలొనే వస్తుండడంతో అటు ప్రభుత్వం, ఇటు భాదితులు ర్యాపిడ్ యాంటిజెన్ ల వైపే దృష్టి పెడుతున్నారు. కానీ యాంటిజెన్ ఫలితాలు పూర్తి నిర్ధారణ కాదు అని నిపుణులు సూచిస్తున్నారు.
“Situs ini selalu memberikan jackpot pencar yang besar untuk member baru
viral303
#slotgacor #viral303#rtpviral303#pragmaticplayviral303″