
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1107 కి చేరుకుంది. బుధవారం మరో 11పాసిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 430 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. గత వారం, పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదు అవుతుండడంతో పాటు జీరో ఆక్టివ్ కేసుల జిల్లాలు సైతం పెరుగుతున్నాయి. కాగా ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే నమోదు అవుతుండడం కలవరపెడుతోంది. బుధవారం నమోదైన కేసులన్ని గ్రేటర్ లొనే ఉన్నాయి. మరో 20 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.