
హైదరాబాద్, నిఘా 24: కరోనా మహమ్మారి సమయంలో మన ఆసుపత్రుల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. కోవిడ్ మహమ్మారి విజృంభించి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురికాగా, ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ఆసుపత్రులు దోపిడీకి తెరలేపాయి. రెండేళ్లవుతున్నా నేటికి కొన్ని ఆసుపత్రుల ఆగడాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా వినియోగదారుల కమిషన్ ఆదేశాలు చూస్తే నాటి ఆసుపత్రుల దోపిడీ ఏ విధంగా సాగిందో అర్థం అవుతుంది. జూబ్లీహిల్స్ కు చెందిన మృత్యుంజయ రెడ్డి కోవిడ్ చికిత్స నిమిత్తం 2021 ఆగస్టు 8వ తేదీన నానక్ రాంగుడలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరాడు. నెల రోజులు చికిత్స చేసిన ఆసుపత్రి డాక్టర్లు మృత్యుంజయ రెడ్డి మరణించాడని చెప్పారు. చికిత్సకు మొత్తం 64.93 లక్షల బిల్లు అయ్యిందని, 16.93 లక్షలు డిస్కౌంట్ ఇచ్చి.. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి 48 లక్షల రూపాయలు వసూలు చేశారు. 48 లక్షలు కట్టినా తన భర్తను బ్రతికించని ఆసుపత్రి మీద మృత్యుంజయ రెడ్డి భార్య వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు.
ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా 4 లక్షల ఖర్చు జరిగే చికిత్సకు 48 లక్షలు వసూలు చేశారని కమిషన్ లో పిర్యాదు చేసింది. ఈ పిర్యాదును విచారించిన వినియోగదారుల కమిషన్ కాంటినెంటల్ హాస్పిటల్ చికిత్స పేరుతో అక్రమానికి పాల్పడినట్టు తేల్చింది. హాస్పిటల్ వసూలు చేసిన బిల్లులో నుంచి మృతుడి కుటుంబానికి 33.43 లక్షలు తిరిగి ఇవ్వాలని, అదనంగా 50వేల పరిహారం, 10 వేల కేసు ఖర్చులు చెల్లించాలని తీర్పు వెల్లడించారు. వినియోగదారుల కమిషన్ కు సైతం 25వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.
Dear immortals, I need some wow gold inspiration to create.
Dear immortals, I need some wow gold inspiration to create.