
హైదరాబాద్: ఓ వ్యక్తి మెదడులో ఏర్పడిన పెద్ద కణితిని నగరంలోని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి తొలగించారు. 7 గంటల పాటు క్లిష్టమైన ఆపరేషన్ చేసి విజయవంతంగా కణితిని తొలగించిన వైద్యులు 72 గంటల్లోనే రోగిని సాధారణ స్థితికి తీసుకువచ్చి ఇంటికి తరలించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి డ్రైవరుగా పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ ను సంప్రదించగా డాక్టర్లు అతని కుడివైపు మెదడులో క్రికెట్ బాల్ కంటే పెద్ద కణితిని గుర్తించారు. ఈ మేరకు జూన్ 4వ తేదీన 7గంటల పాటు క్లిష్టమైన ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. కుడివైపు మెదడులో సగాన్ని ఆక్రమించి, కణితి, 6x6x5 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న కణితిని కాంటినెంటల్ ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరో & స్పైన్ సర్జన్ డాక్టర్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా తొలగించారు. మెదడులోని అతి సున్నితమైన ప్రదేశంలో ఏర్పడిన కణితిని 7గంటల ఆపరేషన్ ద్వారా తొలగించారు. తొలగించిన కణితిని పరీక్షల కోసం బయాప్సీకి పంపించారు.