
హైద్రాబాద్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కరోనా మహమ్మారి కి బలయ్యాడు. కరోనా కారణంగా యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జి. నరేందర్ యాదవ్ తుదిశ్వాస విడిచారు. గతకొన్ని రోజులుగా లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలను, కరోనా రోగులను ఆదుకునే కార్యక్రమాల్లో నరేందర్ యాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో నరేందర్ యాదవ్ కు కరోనా సోకి ఉంటుందని బావిస్తుండగా, గతకొన్ని రోజులుగా యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఆరోగ్యం విషమించడంతో సోమవారం తెల్లవారుజామున నరేందర్ యాదవ్ తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న నరేందర్ యాదవ్, పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.