
శేరిలింగంపల్లి, నిఘా24 : కొండాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జి. మహిపాల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాలో కొండాపూర్ అభ్యర్థిగా ప్రకటించింది. గురువారం కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. మహిపాల్ యాదవ్ గత కొన్ని రోజులుగా కొండాపూర్ డివిజన్ లో ఉద్ధృతంగా పర్యటిస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ బీజేపీలో చేరగా, కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన మహిపాల్ యాదవ్ కొండాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు