
హైదరాబాద్, నిఘా24: జీహెచ్ఏంసీ చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అవినీతిపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు మంగళవారం స్థానికులు పిర్యాదు చేశారు. చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని మొత్తం ప్రక్షాళన చేయాలని కోరారు. ముఖ్యంగా అధికారుల అండదండలతో ఈ సర్కిల్ లో పాగా వేసిన ఓ సెక్షన్ ఆఫీసర్(టిపిఎస్) ఏకంగా మూడు డివిజన్లలో చక్రం తిప్పుతున్నాడని, ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని వసూళ్లకు పాల్పడుతున్నాడని పిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల వద్ద డబ్బు వసూలు చేస్తూ, సామాన్యుల పనులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడని, జీహెచ్ఏంసీ ఆదాయానికి గండి కొడుతున్నాడని పిర్యాదు చేశారు.

3 Comments