
హైదరాబాద్: యూజర్ల అభిరుచికి అనుగుణంగా టిక్ టాక్ స్థానంలో తెలంగాణ నుంచి chat pat యాప్ దూసుకువచ్చింది. తెలంగాణ కు చెందిన యువకుడు రూపొందించిన chat pat ప్రస్తుతం యూజర్లను అమితంగా ఆకర్షిస్తుంది. టిక్ టాక్ కు ధీటుగా రూపొందించిన chat pat గూగుల్ ప్లే స్టోర్ సోషల్ కేటగిరీలో ఒక్కరోజులోనే టాప్ -10లో ట్రెండింగ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా నవాబుపేట కు చెందిన నస్కంటి శ్రీనివాస్ అనే యువకుడు chat pat కు రూపకల్పన చేశాడు. ఇండియా – చైనా మధ్య ఉద్రిక్తతల మధ్య మన దేశం పలు చైనా యాప్ లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అందులో టిక్ టాక్ సైతం ఉండగా, ప్రస్తుతం టిక్ టాక్ స్థానంలో తెలంగాణ యాప్ chat pat యూజర్లను ఆకట్టుకుంటుంది. మూడు రోజుల్లోనే ప్లే స్టోర్ ట్రెండింగ్ లో 9వ స్థానానికి చేరింది. తెలంగాణ లో రూపుదిద్దుకున్న పూర్తి స్వదేశీ chat pat యాప్ మీద యూజర్లు మక్కువ చూపిస్తున్నారు.