
శేరిలింగంపల్లి, నిఘా 24: గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 19, 20 తేదీల్లో చార్మినార్ కప్ స్విమ్మింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు గచ్చిబౌలి స్విమ్మర్ అసోసియేషన్ కార్యదర్శి కొండా విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, గచ్చిబౌలి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి లతో కలిసి సోమవారం స్విమ్మింగ్ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 6 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గల స్విమ్మర్లు పాల్గొనేందుకు అర్హులని సూచించారు.
ఇప్పటివరకు 300 మందికి పైగా స్విమ్మర్లు పోటీలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న స్విమ్మర్లు వివరాల కోసం 94412 29192 నెంబరులో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు ఉమేష్, జగదీష్, సమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.