
హైదరాబాద్, నిఘా24 : చందానగర్ సర్కిల్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు షేడ్లు, నిర్మాణాలను తొలగిస్తుండగా, స్థానికులు ఆవేశంతో అధికారుల వాహనాల మీద దాడి చేసి ధ్వంసం చేశారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని చందానగర్ శ్రీదేవి ధియేటర్ రోడ్డులో శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. కాగా స్థానికులు రోడ్డు వైడనింగ్ పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం జరుగగా, స్థానికులు ఆగ్రహంతో జీహెచ్ఎంసీ అధికారి వాహనాన్ని ధ్వంసం చేశారు. కారుపై దాడిచేసి అద్దాలు పగులగొట్టారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానికులపై చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.