
హైదరాబాద్ : కరోనా టెస్టింగ్ సెంటర్ గా గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో కరోనా టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ అధినంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ దేశంలోని పలు విద్యా సంస్థలు, యూనివర్సిటీలను టెస్టింగ్ సెంటర్లుగా గుర్తించారు. అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైతం ఉంది. కరోనా సాంపిల్ టెస్టింగ్ రీజినల్ క్లస్టర్ సెంటర్ గా హెచ్ సీయూ సేవలు అందించనుంది. ఇందుకోసం 15మందిని ఎంపిక చేసి సీసీఎంబిలో 2 రోజుల శిక్షణ కు పంపించనున్నారు.