
హైదరాబాద్: గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన కోవిడ్-19 ప్రత్యేక ‘ తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ఆసుపత్రిని శనివారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరిశీలించింది. గచ్చిబౌలిలోని 14 అంతస్థుల స్పోర్ట్స్ విలేజ్ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. 1500 పడకలతో సిద్ధం చేసిన ఈ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ 5గురు సభ్యుల బృందం పరిశీలించింది. వీరికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వసతులను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి
రఘునందన్ రావు,
ఉస్మానియా సూపరెండేంట్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.