
శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రభుత్వ విప్ గా నియమితులైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీకి సోమవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా విజయవంతంగా సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే గాంధీ ప్రభుత్వ విప్ పదవికి వన్నె తెస్తారని కార్పొరేటర్ సాయిబాబా అన్నారు. రాగం జంగయ్య యాదవ్, రాజు ముదిరాజ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
9 Comments