
శేరిలింగంపల్లి : ఖాజాగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన బోయిని సత్యనారాయణను బుధవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఘనంగా సన్మానించారు. ఈ మేరకు బుధవారం ఖాజాగుడలోని స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కార్పొరేటర్ సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోయిని సత్యనారాయణ చేసిన సేవలను కొనియాడారు. ఖాజాగుడ పాఠశాల అభివృద్ధి లో సత్యనారాయణ తనదైన ముద్ర వేశారన్నారు. సత్యనారాయణ సేవలను విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాద్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.