
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరుతూ శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జోనల్ కమిషనర్ హరిచందనకు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ కార్యాలయంలో గురువారం జోనల్ కమిషనర్ హరిచందనను కలిసి పలు సమస్యలను వివరించారు. తారానగర్, గోపీనగర్, నెహ్రూనగర్, బాపునగర్, ఆదర్శ్ నగర్, మజీద్ బండ, లింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, యూజీడీ పైపులైన్ల ఏర్పాటు కోసం నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జోనల్ కమిషనర్ హరిచందన సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ వెంట మాజీ కౌన్సిలర్ దుర్గం వీరేశం గౌడ్ ఉన్నారు.