
శేరిలింగంపల్లి : అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ లో చేపట్టిన యూజీడీ పైపులైన్ పనులను డీఈ శ్రీనివాస్ తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. యుద్ద ప్రాతిపదికన యూజీడీ పనులను కాలనీలోని అన్ని బస్తీల్లో చేపట్టాలని సూచించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, నాణ్యతకు ప్రాముఖ్యత కల్పిస్తేనే అభివృద్ధి పనులు ఎక్కువ రోజులు ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందని కాంట్రాక్టర్ కు సూచించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు వీలుంటుందన్నారు. ఆయనతో పాటు వార్డు మెంబర్ పర్వీన్, నాయకులు రాజు, రవి, లక్ష్మణ్ యాదవ్, మహేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.