
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ధూబె కాలనీ, వెంకటేశ్వర కాలనీలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను బుధవారం అధికారులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి యూజీడీ లేక ప్రజలు పడుతున్న సమస్యకు యూజీడీ పైపులైన్ నిర్మాణం పనులతో శాశ్వతంగా పరిష్కారం చేకూరుతుందని అన్నారు. రెజెంటా పార్కు నుంచి దూబేకాలనీ, వెంకటేశ్వర కాలనీ మీదుగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. వర్షపు నీరు, మురికినీరంతా రెజెంటా పార్కు సమీపంలోకి వచ్చి చేరడంతో స్థానిక ప్రజలు ఇన్నాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యూజీడీ పైపులైన్ పనులతో ఇక ఎలాంటి సమస్య తలెత్తదని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. ఆయనతో పాటు ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్, ఏఈ సునిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
3 Comments