
శేరిలింగంపల్లి: సీసీ కెమెరాలతో భద్రతపై భరోసా ఏర్పడుతుంది అని, ప్రతి కాలనీలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని హాఫిజ్ పేట్ కార్పొరేటర్ వి. పూజితా జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీలో నూతనంగా 1.60 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ.అరేకపుడి గాంధీ,మియపూర్ సి.ఐ వెంకటేశంతో కలిసి కార్పొరేటర్ పూజితా జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేసే సీసీ కెమెరాలను ప్రతి కాలనీలో ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునందుకు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కాలనీ గౌరవ అధ్యక్షులు బలింగ్ గౌతమ్ గౌడ్,అధ్యక్షులు వెంకట్ రెడ్డి, రాజేశ్వరరావు, బలింగ్ రమేష్ గౌడ్, పరమేష్, శ్రీనివాస్ గౌడ్, బాబ్జి, ఆంజనేయులు, వెంకట్ చారి తదితరులు పాల్గొన్నారు.
2 Comments