
శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ బస్తీలో సోమవారం మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. స్థానికులతో కలిసి పాదయాత్ర నిర్వహించి డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ
ఆదిత్య నగర్ బస్తీ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని,చాలా వరకు డ్రైనేజీ సమస్యను పరిష్కరించామన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నూతన పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మునఫ్ ఖాన్, ఖాజా, రఫీ,అహ్మద్,ఈషా,రెహ్మాన్ పాల్గొన్నారు.
2 Comments