
శేరిలింగంపల్లి, నిఘా24: కామాంధుడి చేతిలో దారుణ హత్యకు గురైన చైత్రకు నివాళులర్పిస్తూ గోపన్ పల్లిలో ఆదివారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు, స్థానికులు పాల్గొని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి చైత్రకు నివాళులర్పించారు. స్థానిక బంజారా యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ గోపన్ పల్లి, తండా మీదుగా కొనసాగింది. చైత్రకు న్యాయం చేయాలని, నిందితున్ని కఠినంగా శిక్షించాలని, చైత్ర కుటుంబాన్ని ఆదుకోవాలని ర్యాలీలో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు. చిన్నారి చైత్రకు దారుణంగా హత్య చేసిన నిందితున్ని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. స్థానిక బంజారా యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో స్థానికులు, యువకులు స్వచ్చందంగా పాల్గొన్నారు.
