
శేరిలింగంపల్లి, నిఘా 24 : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో బిఆర్ఎస్ అభ్యర్థి అరేకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి ఖాజాగూడలోని వీకర్ సెక్షన్ కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అరేకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి శాఖమంత్రి కెటిఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళానని అన్నారు.

ముఖ్యంగా నియోజకవర్గం అభివృద్ధి కోసం 9వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేవట్టామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయమని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా అందించేందుకు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అందించిన సంక్షేమ పథకాలను నేడు రాష్ట్రంలోని ప్రతి ఇళ్లు అందుకుంటుందని, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి బిఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
హైటెక్ నియోజకవర్గంగా పేరుగాంచిన శేరిలింగంపల్లిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు భారీ నిధులతో పైఓవర్లను, అండర్ పాస్ లను, లింకు రోడ్లను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొనసాగిన అభివృద్ధిని చూసి ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని, బిఆర్ఎస్ పార్టీని మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గణేష్ ముదిరాజ్, రాజునాయక్, చెన్నంరాజు, రాగం జంగయ్యయాదవ్, రాజు ముదిరాజ్, దారుగుపల్లి నరేష్, నవాజ్, మల్లేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.