
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి పరిధిలోని ధూబే కాలనీలో ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఉన్న రోడ్డుపై బోరు వేశాడు. రహదారిపై బోరు వేయడంతో ఈ దారిలో ఉన్న మంజీరా పైపులైన్ ధ్వంసం అయ్యింది. ఆదివారం ఉదయం నీటి సరఫరా ప్రారంభమైన వెంటనే భారీ ఎత్తున మంజీరా నీటి లీకేజీ జరిగింది. స్థానికంగా నీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ కావడంతో భారీ ఎత్తున నీరు రోడ్డును ముంచెత్తింది. ఓ వైపు త్రాగునీరు లేక ప్రజలు సతమతమవుతున్న సమయంలో ఓ వ్యక్తి కారణంగా విలువైన మంచినీరు వృధాగా పొయింది. కాగా ఎటువంటి అనుమతి లేకుండా రహదారిపై బోరు వేస్తున్నా అధికారులకు సమాచారం లేకపోవడం గమనార్హం.
