
హైదరాబాద్ : బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డాడు. అమితాబ్ బచ్చన్ కు టెస్టింగ్ లో పాజిటీవ్ రావడంతో ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే ట్వీట్ చేసాడు. తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పాడు అమితాబ్. ఇప్పటికే ముంబైలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. అక్కడ బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే బాలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కరోనాతోనే చనిపోయాడు. ఆయనతో పాటు మరో అరడజన్ మంది వరకు కోవిడ్ 19 కారణంగా కన్నుమూసారు. అందులో సీనియర్ నటులతో పాటు నిర్మాతలు కూడా ఉన్నారు. ఇప్పుడు అమితాబ్ కూడా కోవిడ్ బారిన పడటంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు.