
శేరిలింగంపల్లి : కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో రక్తం నిల్వలు లేక అవస్థలు పడుతున్న రోగులను దృష్టిలో ఉంచుకొని నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందనగర్ లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. మదినగూడ విజయ హాస్పిటల్ ఎండీ అల్లం పాండురంగా రావు సౌజన్యంతో పీజేఆర్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన ఈ శిబిరంలో డాక్టర్ కిరణ్, కుకట్ పల్లి ఇన్ స్పెక్టర్ టంగుటూరి శ్రీనివాస్ తో పాటు వివిద రంగాలకు చెందిన ప్రముఖులు, స్థానిక యువకులు మొత్తం 102 మంది రక్తదానం చేశారు. శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ శిబిరాన్ని ప్రారంభించగా, కార్పొరేటర్లు బొబ్బ నవత రెడ్డి, వి జగదీశ్వర్ గౌడ్, చందానగర్ ఇన్ స్పెక్టర్ రవిందర్, సైబరాబాద్ సీపీ కార్యాలయం ఆర్ఎస్ఐ ఫిలిప్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ లు శిబిరాన్ని సందర్శించి దాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకర & జననీ బ్లడ్ బ్యాంక్, విజయ హాస్పిటల్ ప్రతినిధులు, నవయుగ యూత్ సలహాదారు పుట్ట వినయకుమార్ గౌడ్, అధ్యక్షుడు కలివేముల వీరేశం గౌడ్, సభ్యులు పాల్గొన్నారు.