
శేరిలింగంపల్లి, నిఘా 24: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి గజ్జల యోగానంద్ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలను స్థానిక నాయకులతో కలిసి యోగానంద్ సందర్శించారు.

మియపూర్ న్యూ కాలనీలో బంజారా యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడికి, తుల్జా భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపయ్యకు, లింగంపల్లి తారా నగర్ వినాయకుడికి, ఖాజాగూడ జైన్ కార్ల్ టాన్ క్రీక్ వినాయకుడి పూజల్లో యోగానంద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు యోగానంద్ ను ఘనంగా సన్మానించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి జరుపుకోవాలని యోగానంద్ పిలుపునిచ్చారు. ఈ పూజా కార్యక్రమాల్లో యోగానంద్ తో పాటు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
