
హైదరాబాద్ : ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ ప్రజల చిరకాల సమస్యను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిష్కరించారని ఎమ్మెల్సీ రామచంద్రరావు, బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావులు పేర్కొన్నారు. గురువారం చందానగర్ లో నెహ్రూ యువ కేంద్ర, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన థీమ్ బేస్డ్ అవెర్నెస్ & ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో నెహ్రు యువ కేంద్ర సెంట్రల్ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావుతో కలిసి వారు పాల్గొన్నారు. నెహ్రు యువ కేంద్ర ఇంచార్జ్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు పైన మాట్లాడుతూ ఆర్టికల్ 370ని రద్దు చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఈ ఆర్టికల్ ను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అలాగే కేంద్రంలో యువత కోసం అనేక పథకాలను మోడీ తీసుకొచ్చారని అన్నారు.ముద్ర యోజన,డిజిటల్ ఇండియా,స్కిల్ ఇండియా,యువ సహకార వంటి అనేక పథకాలను తెచ్చి దేశంలో నిరుద్యోగం లేకుండా చేస్తున్న నాయకుడు నరేంద్రమోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ కోట నాయక్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, అధికార ప్రతినిధి నరేష్, బల్ద అశోక్, జాతీయ కార్యవర్గ సభ్యులు నరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.