
హైదరాబాద్, నిఘా 24: గతకొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నెలకొరిగిన భారీ వృక్షానికి తిరిగి ప్రాణం పోశారు. మాదాపూర్ బీజేపీ నాయకుడు గంగల రాధాక్రిష్ణ యాదవ్ ఆధ్వర్యంలో వాటా ఫౌండేషన్ సహకారంతో చెట్టుకు పునర్జీవం చేశారు. మాదాపూర్ హైటెక్ సిటీ పరిధిలోని నోవోటెల్ లో గత 30 సంవత్సరాలుగా స్వచ్ఛమైన గాలిని అందిస్తున్న వృక్షం కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నేలకొరిగింది. ఈ విషయం తెలిసిన బీజేపీ నాయకుడు, మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ చెట్టును బ్రతికించేందుకు సిద్ధమయ్యారు. వాటా ఫౌండేషన్ తో కలిసి నోవోటెల్ యాజమాన్యం సహకారంతో వృక్షానికి పునర్జీవం పోశారు. కూలిన చెట్టును తిరిగి నాటి ప్రాణం పోశారు. పర్యావరణ హితం కోసం వీరు చేసిన కృషిని స్థానికులు అభినందించారు.
