
శేరిలింగంపల్లి, నిఘా 24 : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులకు బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేరిలింగంపల్లి పరిధిలోని మియాపూర్ నడిగడ్డ తాండాలో కొలువుదీరిన గణపయ్య పూజల్లో పాల్గొనడంతో పాటు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో స్థానికులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురం కాలనీలో గల కమ్యూనిటీ హాల్ లో స్థానిక కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి కసిరెడ్డి భాస్కరరెడ్డి పూజలు చేశారు.

ఈ సందర్భంగా భాస్కరరెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని సూచించారు. మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పూజించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గణనాథుడి ప్రత్యేక పూజల్లో స్థానిక కాలనీ వాసులు ఆంజనేయులు, చందు, రాజ్ జైస్వాల్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Dear immortals, I need some wow gold inspiration to create.