
శేరిలింగంపల్లి, నిఘా 24 : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా మారబోయిన రవికుమార్ యాదవ్ ను బీజేపీ పార్టీ ఎంపిక చేసింది. గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించుతూ బీజేపీ అధిష్టానం గురువారం రవికుమార్ యాదవ్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో రవికుమార్ వర్గీయులు సంబరాల్లో మునిగిపోగా, శుక్రవారం నామినేషన్ వేసేందుకు సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎంపికపై గతకొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. శేరిలింగంపల్లి బీజేపీ టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉండడంతో పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందో అనే ఆత్రుత గతకొన్ని రోజులుగా స్థానిక బీజేపీ నాయకుల్లో నెలకొంది. మరోవైపు జనసేన పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ సైతం శేరిలింగంపల్లి టికెట్ కోసం పట్టుబట్టడంతో తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ పటిష్టంగా ఉండడం, రవికుమార్ యాదవ్ ఇప్పటికే గడప గడపకు పాదయాత్ర నిర్వహించడంతో ఎట్టకేలకు శేరిలింగంపల్లి టిక్కెట్ ను బీజేపీ అంటిపెట్టుకోగా, అభ్యర్థిగా రవికుమార్ యాదవ్ ను ఎంపిక చేసింది.
Dear immortals, I need some wow gold inspiration to create.
Dear immortals, I need some wow gold inspiration to create.