స్పెషల్ ఫోకస్

*జీవం లేని జీవవైవిధ్య పార్కు*

హైదరాబాద్, నిఘా24: జీవ వైవిధ్య పార్కు జీవం లేకుండా కళావిహీనంగా మారిపోయింది. నిర్వహణ గాలికి వదిలేయడంతో పార్కులో పచ్చదనం కనుమరుగు కాగా ఎండిన మొక్కలు, నిండిన చెత్తాచెదారం దర్శనమిస్తున్నాయి. బయోడైవర్సిటీ పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా దేశ, విదేశాల ప్రతినిధులు నాటిన మొక్కల్లో చాలా వరకు ఎండిపోయి… కూలిపోయి… కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం వాటి ఆనవాళ్లకు గుర్తుగా నాడు దేశాల ప్రతినిధులు నాటిన మొక్కల విశేషాలతో కూడిన బోర్డులు మాత్రం తుప్పుపట్టి దర్శనమిస్తున్నాయి.

2012వ సంవత్సరంలో నగరంలో నిర్వహించిన జీవవైవిధ్య సదస్సు సందర్భంగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ పార్కును ప్రారంభించారు. కోట్ల రూపాయల వ్యయంతో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ పార్కులో సదస్సులో పాల్గొన్న 194దేశాల ప్రతినిధులు మొక్కలు నాటారు. తెలంగాణ ఏర్పాటు తరువాత టీఎస్ఐఐసికి దీని నిర్వహణ ఇవ్వడంతో, రెండు కోట్ల రూపాయలతో పార్కును మరింత అభివృద్ధి చేసి 2015లో ప్రజల సందర్శనకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ అనంతర కాలంలో పార్కు నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో ప్రస్తుతం పార్కు జీవం లేకుండా మారిపోయింది. ఎండిన గడ్డి, చెట్లతో పచ్చదనం కనిపించకపోగా, ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది.
పెచ్చులూడిన పైలాన్…
పార్క్ మధ్యలో జీవవైవిధ్యాన్ని సూచించే ఈ విధంగా, సదస్సుకు గుర్తుగా పైలాన్ ను ఏర్పాటు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన 32 అడుగుల పైలాన్ ప్రస్తుతం పెచ్చులు ఊడిపోయి కళావిహీనంగా మారిపోయింది. పంచభూతాలను ప్రతిబింబించే ఈ పైలాన్ ఆలనా పాలనా కరువై చెత్త, దుమ్ముతో జీవం లేకుండా మారింది. పైలాన్ చుట్టూ ఏర్పాటుచేసిన వలయం ఎండిన గడ్డి, చెట్లతో ఎడారి తలపిస్తుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆర్బాటంగా ప్రారంభించిన బయోడైవర్సిటీ పార్క్ నిర్వహణను గాలికి వదిలేయడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం శోచనీయం.

Show More

Jagan Reddy

Nigha 24 is the best news portal in Hyderabad maintained by Jagan Reddy, a responsible News Reporter, who is serving the nation by empowering all kinds of people with his writings and bringing the revolution in peoples with his literature.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your Browser. Please allow us on for smoother experience. We work hard to deliver the content to you without any cost. Please support us.