
సైబరాబాద్ : తెలుగు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్-3పై సినీ నటి గాయత్రి గుప్తా పిర్యాదు చేశారు. ఏప్రిల్ రెండవ వారంలో బిగ్ బాస్ నిర్వాహకులు చేసిన ఇంటర్వ్యూ లో తన సెల్ఫ్ రెస్పెక్ట్ కు భంగం కలిగించే విధంగా వ్యవహారించారిని నటి గాయత్రీ గుప్తా ఆదివారం రాయదుర్గం పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. మణికొండ జై హింద్ నగర్ లో నివాసం ఉంటున్న గాయత్రీ గుప్తా గత రెండు రోజులుగా పలు చర్చా వేదికల్లో బిగ్ బాస్ నిర్వాహకులపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ రెండవ వారంలో బిగ్ బాస్-3 కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ లో తనను అసభ్య ప్రశ్నలతో వేదించారని పేర్కొంటూ యాంకర్ శ్వేతారెడ్డితో కలిసి ఆదివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
