
హైదరాబాద్, నిఘా 24 : గుడి, బడి.. ఏదున్నా సరే…, సమయం, సందర్భం.. ఎంతైనా సరే… , వారం, వజ్రం… ఏదైనా సరే… ఇక్కడ ఎనీ టైమ్ లిక్కర్ అవేలబుల్… ఇది రాష్ట్రంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో కాదు… రాష్ట్ర రాజధాని నడిబొడ్డున, అంతర్జాతీయ ఐటీ సంస్థలు కొలువుదీరిన ఐటీ కారిడార్ లో… ఈ 24/7 సదుపాయాలు ఏ వైన్ షాపులో, బార్ అండ్ రెస్టారెంటులో కాదు.. నిబంధనలకు విరుద్ధంగా, దోపిడీ ధ్యేయంగా కొలువుదీరిన బెల్టు షాపుల బరితెగింపులు… ఈ బెల్టు షాపుల ఆగడాలను అధికారులు అడ్డుకోకపోగా, లోతుగా పరిశీలిస్తే విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి.
హైటెక్ మండలం శేరిలింగంపల్లిలో రోజురోజుకి విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలుస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో బెల్టు షాపులే లేవని ప్రభుత్వం ప్రకటించుకుంటుండగా, అనుక్షణం నిఘూనేత్రం మధ్య పహారా ఉండే ఐటీ కారిడార్ ప్రాంతంలో బెల్టుషాపుల మద్యం ఏరులై పరుతుండడం విశేషం. శేరిలింగంపల్లి పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో అక్రమంగా వెలిసిన బెల్టుషాపులు యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగిస్తున్నాయి.

కిరాణా దుకాణాలు, టీ హోటల్ల మాటున దర్జాగా బెల్టుషాపులు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. గుడి,బడి అనే పట్టింపు లేకుండా యథేచ్ఛగా నివాస గృహాల మధ్య, దేవాలయాల సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ బెల్టుషాపులకు డ్రై డేలు, జాతీయ పండుగలు అంటూ ఏమీ ఉండవు. 365 రోజులు 24గంటల పాటు ఎప్పుడు వెళ్లినా, వైన్ షాపుల తరహాలో ఏ బ్రాండ్ అయినా అందుబాటులో ఉంటుంది. కొన్ని బెల్టుషాపులు రెస్టారెంట్ల తరహాలో ఏకంగా అక్కడే సిట్టింగ్ సౌకర్యం కల్పిస్తున్నాయంటే వీటి వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. శేరిలింగంపల్లి పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, నానక్ రాంగూడ, ఖాజాగూడ, గౌలిదొడ్డి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల మధ్యే ఈ బెల్టుషాపులు ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వేళల్లో అందుబాటులో బెల్టుషాపులు ఉండడంతో స్థానిక యువత మద్యానికి బానిసగా మారుతున్నారని, పచ్చని సంసారాల్లో ఈ బెల్టుషాపులు చిచ్చు పెడుతున్నాయని వాపోతున్నారు. సిద్దిక్ నగర్లో కాలనీ అసోసియేషన్ కు లక్షలు ముట్టజెప్పి బెల్టుషాపులు నిర్వహించుకోవడం బహిరంగ రహస్యం.

వైన్ షాపుల ప్రోత్సాహంతోనే…
శేరిలింగంపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బెల్టు షాపులు స్థానిక వైన్ షాపుల ప్రోత్సాహంతోనే కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తమ ఆదాయం రెట్టింపు, అధిక ధరకు విక్రయించడం కోసం కొందరు వైన్ షాపుల యజమానులే బెల్టుషాపులను ప్రోత్సాహిస్తున్నారని, వైన్ షాపుల వాహనాల్లో బెల్టుషాపులకు మద్యం సరఫరా జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు. వైన్ షాపుల్లో ఉండే నిబంధనలేవి లేకుండా బెల్టుషాపుల్లో విక్రయాలు సాగించవచ్చని కొన్ని వైన్ షాపులే బెల్టుషాపులను ప్రోత్సాహిస్తున్నాయని, ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే ఈ బెల్టుషాపుల దందా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలుమార్లు స్థానికులు బెల్టుషాపుల మీద ఆధారాలతో పిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతుంది.

Dear immortals, I need some wow gold inspiration to create.
Are you creating a FiveM server? Here are the best scripts for FiveM, for a cheap price and a very good quality! Don’t waste your time for testing and fixing free FiveM scripts. Use our premium FiveM scripts.
FiveM Store
ఎన్నికల వేళ… శేరిలింగంపల్లిలో కబ్జాల గోల
2 weeks ago
రూ.51లక్షల నగదు, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్న రాయదుర్గం పోలీసులు
4 weeks ago
ఎమ్మెల్యే గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా
4 weeks ago
శేరిలింగంపల్లిలో వైన్ షాపుల నయా ‘బెల్టు’ దందా
4 weeks ago
మాదాపూర్ ఓయో హోటల్ లో ఆసలేం జరిగింది..?
4 weeks ago
Dear immortals, I need some wow gold inspiration to create.