
శేరిలింగంపల్లి, నిఘా 24: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బతుకమ్మ ఉత్సవాలను సగర మహిళలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర పిలుపునిచ్చారు. ఆదివారం గచ్చిబౌలిలోని రాష్ట్ర సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సగర మహిళా సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శేఖర్ సగర మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర సగర మహిళా సంఘం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ ఘాట్ లో ఘనంగా నిర్వహించేందుకు వేలాది మంది సగర మహిళలను తరలించాలని సూచించారు. రాష్ట్రంలోని సగరుల న్యాయమైన డిమాండ్ల సాధనకు రాష్ట్ర సగర మహిళా కమిటీని మరింత పటిష్టం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సగర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పెద్దబూది మహేశ్వరి సగర అధ్యక్షతన జరిగిన ఈ కార్యవర్గ సమావేశంలో అన్ని జిల్లాల్లో మహిళా కమిటీలు వేయాలని, సగర కులం జనగణన ను త్వరగా పూర్తి చేయాలని, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని తీర్మానాలు చేసారు.

ఈ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల స్రవంతి సగర, కోశాధికారి పల్లవి సగర, గౌరవ సలహాదారులు సుమనలత సగర, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి సగర, ఆస్కాని చంద్రకళ సగర, సరిత సగర, జయమ్మ సగర, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు చిలుక జ్యోతి సగర, కీర్తి కోటేశ్వర సగర, అనిశెట్టి రజిని సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.మంజుల సగర, కమిటీ ఉపాధ్యక్షులు డి. సునీత సగర, టి. రాధా సగర, కే. మంగమ్మ సగర, కే. లక్ష్మీ సగర తదితరులు పాల్గొన్నారు.