
హైదరాబాద్,నిఘా 24: హైదరాబాద్ నగరంలో మొదటి 6లైన్ల ఫ్లైఓవర్ నగర ప్రజలకు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లో ఇప్పటికే ఎన్నో ఫ్లైఓవర్లు అందుబాటులో ఉన్నా, 6లైన్ల విస్తీర్ణంతో ఫ్లైఓవర్ రూపుదిద్దుకోవడం ఇదే మొదటిసారి. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎన్ఆర్‌డీపీ పథకం కింద బాలానగర్ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ను మంగళవారం ప్రారంభించనున్నారు. 1.13 కిలోమీటర్ల మేర నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్‌ను 6వ తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు.

ఈ బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు… వెడల్పు 24 మీటర్లు… 26 పిల్లర్ల… తో నిర్మించారు. కాగా నగరంలోనే మొదటిసారిగా 6లైన్లుగా నిర్మాణం చేపట్టడం ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకత. మంగళవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుగనుండగా, ఫ్లైఓవర్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో సోమవారం రాత్రి విద్యుత్ దీపాల కాంతులతో కనువిందు చేసింది.