
హైదరాబాద్ :హైదరాబాద్ నగరంలో అనంతపుర్ కు చెందిన ఓ చర్చి ఫాస్టర్ దారుణ హత్య కు గురయ్యాడు. హఫీజ్ పేట్ లో ఉన్న ఓ ప్లాటు వివాదంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ హత్య చోటుచేసుకుంది. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉండే చర్చి ఫాస్టర్ సత్యనారాయణ రెడ్డి(46) శుక్రవారం నగరానికి వచ్చాడు. శేరిలింగంపల్లి పరిధిలోని హఫీజ్ పేట్ లో ఉన్న 100 గజాల ప్లాటు విషయంలో కొన్ని రోజులుగా సత్యనారాయణ రెడ్డికి , ఇతరులకు మధ్య వివాదం కొనసాగుతుంది. కాగా శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు కొండాపూర్ జెవిజి హీల్స్ రోడ్డులో సత్యనారాయణ రెడ్డిని కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు.