
పటాన్ చెరు, నిఘా 24: స్ప్రింగ్ బోర్డు ఇంటర్నేషనల్ స్కూల్ అమీన్ పూర్ బ్రాంచ్ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఉత్సాహంగా నిర్వహించారు. అమీన్ పూర్ లో నిర్వహించిన ఈ వేడుకల్లో స్కూల్ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. వెస్ట్రన్, క్లాసికల్ డ్యాన్స్ లతో చిన్నారులు కనువిందు చేశారు. వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు చేసిన కల్చరల్ ప్రోగ్రాంలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్ప్రింగ్ బోర్డు ఇంటర్నేషనల్ స్కూల్ అమీన్ పూర్ బ్రాంచ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సుధాకర్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులకు సంప్రదాయ పద్ధతులే కాకుండా సరికొత్త పద్ధతుల్లో విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు.

సాంస్కృతిక పద్ధతులకు భిన్నంగా బోధనను అలవర్చుకోవాలని చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతులతో పాటు సాంస్కృతిక, స్పోర్ట్స్, విభాగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు వారన్నారు. ఉత్తమ విద్యా బోధనతో పాటు, ఉత్తమ ఫలితాలను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రసన్న రెడ్డి, రాధారెడ్డి, ఉపాధ్యాయులు, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు.