
తెలంగాణ, నిఘా 24 : నగరం మధ్య నుంచి పారుతున్న మూసీ నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను మరింత అనుసంధానం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 168 కోట్ల రూపాయల వ్యయంతో మూసీ నదిపై కొత్తగా 5 వంతెనలు నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఈ వంతెనల పనులకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉప్పల్ భాగాయత్ వద్ద శంకుస్థాపన చేయనున్నారు. ఈ వంతెనల నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే మహానగరంలోని ప్రధాన ప్రాంతాలైన నార్సింగి నుంచి గౌరెల్లి మధ్య 55 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు పరిష్కారం కానుంది.

హెచ్ఎమ్డిఏ ఆధ్వర్యంలో 168 కోట్ల రూపాయల వ్యయంతో 4 లైన్లలో ఈ 5 వంతెనలను నిర్మించనున్నారు. బుద్వేల్ ఐటీ పార్కు వద్ద 2 వంతెనలు, మంచిరేవుల, ఉప్పల్ భాగాయత్, ప్రతాప సింగారంలలో ఒక్కో వంతెనను నిర్మించనున్నారు. అన్ని వంతెనలను 15 నెలల్లో పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వంతెనలు అందుబాటులోకి వస్తే నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గనుంది.
Dear immortals, I need some wow gold inspiration to create.