
తెలంగాణ, నిఘా 24: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు మరో అవకాశం కల్పించింది. 2వేల నోట్లను డిపాజిట్ చేయడానికి మరో వారం రోజుల గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్బీఐ ప్రకటించిన ప్రకారం 2వేల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడికి సెప్టెంబర్ 30 శనివారంతో గడువు ముగిసింది. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం చేసిన ప్రకటనలో రూ. 2,000 కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి అక్టోబర్ 7, 2023 వరకు గడువును ఒక వారం పాటు పొడిగించింది. అయితే, బ్యాంకు నోట్లను 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మాత్రమే డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చని తెలిపింది. ఉపసంహరణ ప్రక్రియకు నిర్దేశించిన వ్యవధి ముగిసినందున, తాజాగా సమీక్ష నిర్వహించిన అధికారులు రూ. 2000 నోట్ల డిపాజిట్/మార్పిడి కోసం గడువును అక్టోబర్ 07, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించారు. మరోవైపు చలామణిలో ఉన్న 2వేల నోట్లలో 95శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది.
Dear immortals, I need some wow gold inspiration to create.
Dear immortals, I need some wow gold inspiration to create.
gzhshautoparts.com Honda Oil Filter gzhshautoparts.com.