
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారిని విజయవంతంగా జయించిన 20 రోజుల పసికందు అజేయుడుగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మరో 13 మంది చిన్నారులు సైతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో బుధవారం డిశ్చార్జ్ అయిన 35మందిలో 13 మంది చిన్నారులు ఉన్నారు. దేశంలోనే కరోనా బారిన పడిన అతిచిన్న వయస్కుడు, 20 రోజుల పసికందు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ కు చెందిన ఈ చిన్నారికి తన తండ్రి కాంటాక్ట్ తో కరోనా సోకింది. కరోనాతో ఆసుపత్రిలో చేరే నాటికి 20 రోజుల పసికందు కాగా, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బుధవారానికి ఈ బాలుడి వయసు 45 రోజులు. బుధవారం రాష్ట్రంలో 7 కొత్త కేసులు నమోదు కాగా ఈ కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. బుధవారం 35 మంది డిశ్చార్జ్ కాగా, వీరి డిశ్చార్జ్ ద్వారా 11 జిల్లాలు జీరో ఆక్టివ్ కేస్ జిల్లాలుగా ఏర్పడ్డాయి. వీటిలో సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్ (రులర్), భద్రాద్రి, నగర్ కర్నూలు, ములుగు, యాదాద్రి జిల్లాలు ఉన్నాయి.
9 Comments