శేరిలింగంపల్లి : నివాస గృహాల మధ్య నుంచి హైటెన్షన్ విద్యుత్ వైర్లు వేయడం ద్వారా తమకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, వెంటనే ఈ పనులను నిలిపివేయాలని గచ్చిబౌలి ఎంఐజీ ఫేజ్ 4 కాలనీ వాసులు వాపోతున్నారు. కాలనీ వాసుల ఆందోళనపై సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శనివారం కాలానికి వెళ్లి పరిశీలించారు. డీఎల్ఎఫ్ వరకు మంజూరైన 220 kV హైటెన్షన్ కేబుల్ ఎంఐజీ ఫేజ్ 4 లోని కొన్ని ఇళ్ల ముందు నుంచి భూగర్భ మార్గం ద్వారా తీసుకెళ్లడంతో ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు వాపోయారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ట్రాన్స్ కో ఎస్ సీ తో ఫోన్ లో మాట్లాడి తాత్కాలికంగా పనులు నిలిపివేయించారు. కార్పొరేటర్ వెంట కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు జార్జ్, సెక్రటరీ సురేందర్, ఉపాధ్యక్షుడు శర్మ, జాయింట్ సెక్రటరీ మధుసూదన్ తదితరులు ఉన్నారు.