
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లారు దుండగులు. గౌలిగూడ బస్టాప్‌లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నైట్‌హాల్ట్ కోసం బస్సును నిలిపాడు డ్రైవర్. తరువాత తిరిగి చూస్తే బస్సు మాయమైంది. ఎవరు ఎత్తుకెళ్లారు.. ఏం చేస్తున్నారనే సమాచారం అటు ఆర్టీసీ అధికారులకు, ఇటు పోలీసులకు అంతు చిక్కడం లేదు. కాగా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్ ప్రాంతంలో ఆ సిటీ బస్సు తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.