
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. మైలార్ దేవపల్లిలో ఐసీస్ సానుభూతి పరుడిని అదుపులోకి తీసుకున్నారు. కింగ్స్ కాలనీలో 8 ఇళ్లలో సోదాలు నిర్వహించి తాహ అనే ఐసీస్ సానుభూతి పరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో భారీ విధ్వంసాలుకు కుట్ర చేసిన హైదరాబాద్ యువకులను గతంలోనే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడికి యువకులు ప్లాన్ చేశారు. ఢిల్లీ లో RSS నాయకుడి హత్య కోసం కెమికల్స్ , డబ్బులను సమకూర్చుకున్నారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన బాసిత్ అనే యువకుడు ఉన్నాడు. బాసిత్ ఇచ్చిన సమాచారం మేరకు శనివారం నగరంలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు తాహ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నగరంలో ఐసీస్ జాడలతో తీవ్ర కలకలం రేగింది.