
శేరిలింగంపల్లి : హాఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, సుభాష్ నగర్ లలో బుధవారం మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. స్థానికులు డ్రైనేజీ సమస్యపై కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో బుధవారం పర్యటించి సమస్యను పరిశీలించారు. అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.