
శేరిలింగంపల్లి: స్వర్గీయ మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి 19వ వర్ధంతిని పురస్కరించుకొని శేరిలింగంపల్లిలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మియపూర్ లోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాదాపూర్ కార్పోరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ లు హాజరై ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.