
హైదరాబాద్ : హైదరాబాద్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన లారీ స్కూల్ బస్సును ఢీ కొట్టింది. నగర శివారు పరిధిలోని ఖాజాగుడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇటుక లోడుతో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి చిరాగ్ స్కూలు బస్సుపై పడింది. లారీ టైరు నాలా గోడ పైకి ఎక్కి ఆగిపోయింది. ఆ సమయంలో స్కూలు బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శంకర్ మట్ డీడీ కాలనీ నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు వెళ్తున్న స్కూలు బస్సుపై లారీ పడిపోయింది.