
హైదరాబాద్ : సిబిఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాల్లో ఓక్రిడ్జ్ విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి, బాచుపల్లి క్యాంపస్ లకు చెందిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. గచ్చిబౌలి క్యాంపస్ కు చెందిన సంజనా రెడ్డి తాడూర్ మొత్తం 500 మార్కులకు గాను 488 మార్కులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచింది. మరో ఇద్దరు విద్యార్థులు రియన్ బాబు, ఆర్య మేఖలు 484 మార్కులు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. నగరంలోని రెండు క్యాంపస్ లు 80శాతం సగటుతో కొత్త రికార్డ్ సృష్టించారు. 25 శాతం పైగా విద్యార్థులు మొత్తం 90 శాతం పైగా మార్కులు సాధించడం విశేషం. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఓక్రిడ్జ్ వైస్ ప్రిన్సిపాల్ శైల భమిడిపాటి అభినందించారు.
