
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ హరీష్ లను కలిశారు. చందానగర్ సెయింట్ ఆన్స్ స్కూల్ దగ్గర రోడ్డు కోసం స్థలం, ఆల్విన్ కాలనీలో బఫర్ జోన్ లో పార్కు కోసం స్థలం, చందానగర్ లో స్టేడియం కోసం స్థలం కేటాయించాలని కోరారు. ప్రభుత్వం కేటాయించిన ఇండ్లలో అక్రమంగా ఉన్నవారిని ఖాళీ చేయించి నిజమైన లబ్దిదారులకు అవకాశం కల్పించాలని, మననగరం కార్యక్రమంలో పలు అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులపై చర్చించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న భూకబ్జాదారులను కట్టడి చేయాలని, డబుల్ బెడ్ రూమ్, అంగన్వాడీ,కాలేజీ నిర్మాణాలకు స్థలాలను కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యేతో పాటు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి పాల్గొన్నారు.